శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 28 జులై 2018 (20:57 IST)

మొహమాటం లేకుండా చెప్తున్నా... కాపు రిజర్వేషన్లపై నేను హామీ ఇవ్వను... జగన్

రాజకీయాలంటేనే అబద్ధపు హామీలు అనే ప్రచారం వుండనే వుంది. దేశంలో ఎన్నో పార్టీలు వున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు గుప్పిస్తుంటాయి. ఐతే వాటిని నమ్మి ప్రజలు ఓట్లు వేశాక వారికి మాత్రం రిక్తహస్తం చూపించేవి చాలా వుంటాయనుకోండి. ఐతే వేరే ప్రత్యామ్నా

రాజకీయాలంటేనే అబద్ధపు హామీలు అనే ప్రచారం వుండనే వుంది. దేశంలో ఎన్నో పార్టీలు వున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు గుప్పిస్తుంటాయి. ఐతే వాటిని నమ్మి ప్రజలు ఓట్లు వేశాక వారికి మాత్రం రిక్తహస్తం చూపించేవి చాలా వుంటాయనుకోండి. ఐతే వేరే ప్రత్యామ్నాయం లేక చాలాచోట్ల ఓట్లు వేసేస్తుంటారు ప్రజలు. ఇదిలావుంటే తాజాగా వైఎస్సార్సీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 
 
విషయం ఏంటయా అంటే... కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదు కనుక వాటిపై తను ఎట్టి పరిస్థితుల్లోనూ హామీ ఇవ్వలేననీ, అది కేంద్ర పరిధిలోనిది కనుక తను దీనిపై హామీ ఇవ్వలేనని అన్నారు. తను చేయగలిగినదైతే ఎలాంటి సంకోచం లేకుండా మాట ఇస్తాననీ, చేయలేనిది చెప్పి మాట తప్పి మడమ తిప్పలేనని అన్నారు. అందుకే కాపు రిజర్వేషన్ల విషయంలో మొహమాటం లేకుండా చెప్పేస్తున్నానని వెల్లడించారు. 
 
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో కాపు రిజర్వేషన్ల గురించి ఆయన స్పందించారు. తను కనుక ఏదైనా మాటిస్తే ఆ మాటపై నిలబడతానని అన్నారు. చెయ్యలేని వాటి గురించి చెప్పే అలవాటు తనకు లేదనీ, రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని, ఈ కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోది కాదు కనుక హామీ ఇవ్వనని తేల్చి చెప్పారు. ఐతే కాపులకు అన్యాయం జరిగిందని చెప్పింది తానేననీ, కాపు కార్పోరేషన్ ద్వారా న్యాయం చేస్తానని వెల్లడించారు.