మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 18 జూన్ 2018 (18:50 IST)

జగన్ వెంట జనం వున్నారు... కానీ చప్పున తిప్పేసే శక్తి బాబుకి ఉంది.. ఉండవల్లి మాట

మాజీ ఎంపీ రాజకీయాలను ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలన చేసే ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం ఏపీలో వున్న రాజకీయ పరిస్థితి గురించి వ్యాఖ్యానించారు. తాజాగా ఏపీలో రాజకీయ బలాబలాపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉన్నట్టుండి

మాజీ ఎంపీ రాజకీయాలను ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలన చేసే ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం ఏపీలో వున్న రాజకీయ పరిస్థితి గురించి వ్యాఖ్యానించారు. తాజాగా ఏపీలో రాజకీయ బలాబలాపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉన్నట్టుండి ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఇప్పుడు ప్రజల్లో వేవ్ వైఎస్ జగన్‌కు అనుకూలంగా ఉందన్నారు. 
 
అయితే ప్రజల్లో ఉన్న వేవ్‌ను మార్చగలిగే సామర్థ్యం సీఎం చంద్రబాబుకు ఉందని ఉండవల్లి అన్నారు. వైఎస్ జగన్‌‍కు సరైన ఎన్నికల టీమ్ లేదని వెల్లడించిన ఉండవల్లి, పవన్ కళ్యాణ్ బలంపైన ఇప్పుడే ఓ అంచనా వేయలేమన్నారు. అయితే వైకాపా చీఫ్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిపోతే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమన్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమనేది చెప్పలేమని ఉండవల్లి అన్నారు.
 
మరోవైపు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఆర్జీ ఫ్లాష్‌ టీమ్ నిర్వహించిన సర్వేలో ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపికి 110 సీట్లు లభిస్తాయని లగడపాటి రాజగోపాల్ సర్వే తేల్చిచెప్పింది. వైసీపీకి 60 సీట్లు మాత్రమే దక్కనున్నాయని తేల్చి చెప్పింది. జనసేన ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని తేల్చి చెప్పింది. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ అలా చెపుతుంటే లగడపాటి సర్వే ఇలా చెపుతుంది. ఏం జరుగుతుందన్నది ఏపీ ప్రజలు చక్కగా 2019లో తేల్చేస్తారనుకోండి.