ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 అక్టోబరు 2024 (19:29 IST)

జగన్ గారు నన్ను సూర్యుడు దగ్గరికి వెళ్లమన్నా వెళ్లిపోయేదాన్ని: కన్నీరు పెట్టుకున్న వైఎస్ షర్మిల

YS Sharmila
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకోసం ఏం చేసారో ఒక్కటి చెబితే వినాలని వుందని వైఎస్ షర్మిల అన్నారు. ఆస్తుల వ్యవహారంపై షర్మిల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... '' నాకు, నా బిడ్డలకు జగన్ గారు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చినిజం. అలాంటి జగన్ గారిని వైసిపి కార్యకర్తలు మోస్తున్నారు. 5 సంవత్సరాలు హక్కు పత్రాలు నా చేతుల్లో వున్నాయి. అవి బయటకుపోతే వైఎస్సార్ గురించి నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతారు.
 
అలాంటి ఎంఓయు పత్రాలు ఈరోజు ఇంతమంది చేతుల్లో ఎందుకు వున్నాయి. విజయమ్మగారిని కోర్టుకు ఈడ్చింది ఎవరు? జగన్ మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. 3200 కి.మీ పాదయాత్ర చేసాను. పాదయాత్రకు వెళ్లు అంటే నా బిడ్డలను వదిలిపెట్టేసి వెళ్లిపోయాను. నన్ను సూర్యుడి దగ్గరకి వెళ్లమన్నా వెళ్లిపోయేదాన్ని" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.