శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (15:02 IST)

ముగ్గురు పిల్లల తండ్రి.. ఇద్దరు పిల్లల తల్లి ఆత్మహత్య.. ఎందుకంటే?

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. వారు కలిసి సహజీవనం చేస్తున్న ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌లోని గన్‌పౌండ్రీకి చెందిన బండారి దత్తు (40) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈయనకు భార్య హేమలత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల తన దూరపు బంధువు భారతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 
 
భారతి భర్త 15 ఏళ్ల క్రితమే చనిపోవడంతో ఆమె ఒంటరిగా జీవిస్తూ వస్తోంది. అయితే, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంగారెడ్డిలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ, అక్కడే ఉంటోంది. దత్తు, భారతిలు వివాహేతర సంబంధం పెట్టుకుని, సహజీవనం చేయడానికి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 
 
అక్కడే సోమవారం ఇద్దరూ ఇనుప రాడ్డుకు ఉరివేసుకుని చనిపోయారు. నాలుగు రోజులుగా దత్తు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి హనుమాన్‌నగర్‌కి వెళ్లి విచారించారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించి, శవాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.