మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (09:10 IST)

పడక గదిలో ప్రియుడితో 'ఆ' పనిచేస్తూ అడ్డంగా దొరికిన భార్య... తర్వాత...

తన ప్రియుడుని ఇంటికి పిలిపించి, ఏకంగా తమ పడక గదిలోనే శృంగారంలో పాల్గొని ఎంజాయ్ చేస్తున్న భార్య... భర్త కంటపడింది. దీంతో భర్తపై పగ పెంచుకున్న భార్య... కట్టుకున్న భర్తను ఇనుపరాడ్‌తో కొట్టి.. చీరతో ఉరివేసి హత్య చేసింది. మిస్టరీగా మారిన ఈ కేసులోని వివరాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. 
 
తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి మల్లేపల్లికి చెందిన తోట దుర్గారావు అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన విషయాన్ని దాచి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టడంతో మొదటి భార్యకు విషయం తెలిసి దుర్గారావును వదిలేసింది. 
 
అనంతరం హైదరాబాద్‌లో ఉంటున్న రెండో భార్య బంధువు సహకారంతో కొంతకాలం క్రితం నగరానికి వచ్చి డ్రైవర్‌గా చేరాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసైన దుర్గారావుకు హెచ్‌ఐవీ సోకింది. విషయం భార్యకు తెలియడంతో అతడిని దూరంగా పెట్టింది.
 
ఈ క్రమంలో తమ సమీప బంధువు తరచూ ఇంటికి రావడంతో అతడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే.. తనను మోసం చేసి పెళ్లి చేసుకోవడమేకాకుండా, హెచ్‌ఐవీ సోకినా లైంగికంగా వేధిస్తున్నందుకు భర్తపై కక్ష పెంచుకుంది. 
 
అక్టోబరు 31వ తేదీ రాత్రి ప్రియుడితో కలిసి ఇంట్లో ఉండటాన్ని దుర్గారావు కళ్లారా చూశాడు. ఇద్దరూ పడకగదిలో పడకపై ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీశాడు. అప్పటికే అతడిపై ఆగ్రహంతో ఉన్న ఆమె ఇనుప రాడ్డుతో భర్త తలపై బలంగా కొట్టింది. అనంతరం ప్రియుడితో కలిసి చీరతో ఉరేసింది. 
 
ఆ రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఈనెల ఒకటో తేదీన ప్రియుడితో కలిసి ఓమ్నీ వ్యాన్‌లో కీసర శివారు ప్రాంతంలోని చెట్లపొదల మధ్య పడేసి వచ్చారు. ఆధారాలు లభించకుండా ఇంటిని శుభ్రం చేసి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. కీసర శివారు ప్రాంతం అంకిరెడ్డిపల్లి ప్రాంతంలో మృతదేహంపడి ఉన్న విషయం పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివిధ కోణాలతో పాటు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా అలు విషయం వెల్లడైంది.