బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు
బ్రిటన్లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి అరుదైన అవకాశం దక్కింది. దేశంలో రెండో అతిపెద్ద పదవైన ఆర్థిక మంత్రిగా రుషి సనక్ నియమితులయ్యారు.
బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా సనక్ నిలిచారు. భారత సంతతికి చెందిన రాజకీయ నేత రుషి సనక్ బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. రుషికి చోటు కల్పించారు. బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ తర్వాత ఈ ఘనత సాధించిన వ్యక్తి రుషి సనక్.
బ్రిటన్ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పదవిని దక్కించుకున్న రుషి.. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు కావటం విశేషం.