ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (21:03 IST)

Fiber Net Scam: IRS అధికారి సాంబశివరావు అరెస్ట్‌

fiber net scam
గత టీడీపీ హయాంలో ఫైబర్ నెట్ కుంభకోణం చోటుచేసుకుంది. అప్పటి లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో ఈ అక్రమాలకు తెరలేవడం సంచలనం సృష్టించింది. సుమారు రూ.2 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని సీఐడీ అధికారులు తేల్చేశారు. 
 
ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ వేగవంతం చేశారు. మాజీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన టెరా సాఫ్ట్ వేర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు టెంబర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు అతిక్రమించారని తెలుస్తోంది.
 
ఈ కేసులో విచారణ ముమ్మరం చేసేందుకు కేసులో సంబంధం ఉన్న వ్యక్తులను పిలిపించారు. అందులో హరిప్రసాద్ తో పాటు ఇన్ ఫ్రాస్ర్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ, ఎండీగా పనిచేసిన సాంబశివరావు హాజరయ్యారు. 
 
శనివారం సాంబశివరావును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయన రాష్ట్రంలో పని చేసేందుకు డిప్యుటేషన్ మీద వచ్చారు. కేంద్ర రైల్వే సర్వీసులకు చెందిన సాంబశివరావు ఏపీలో డిప్యుటేషన్ మీద వేశారు.