బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 18 సెప్టెంబరు 2021 (20:01 IST)

డిజెలు, ర్యాలీలు, మ‌ద్యం...ఏవి క‌నిపించినా అరెస్టే!

ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జెడ్ పి టి సి, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ కొన్ని ఆదేశాలను జారీ చేశార‌ని అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు పోలీసులు అల్టిమేటం జారీ చేశారు. 
 
ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ప్రజలు ఎవరు రోడ్లపై గుమిగూడి ఉండరాద‌ని, కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళే  అభ్యర్థులు తగిన గుర్తింపు కార్డులతో రావాల‌ని చెప్పారు. అభ్యర్థులు ఎటువంటి ఊరేగింపులు చేయ‌డం గాని, బాణా సంచాలు కాల్చ‌డానికి గాని అనుమతులు లేవ‌న్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద గుంపులు గుంపులుగా తిరగరాద‌ని, ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులను అతిక్రమించి మద్యం  బాటిల్స్ కలిగి ఉండరాద‌న్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు వారు తీసుకొను చర్యలకు ప్రజలు అందరూ సహకరించాల‌ని డిఎస్పీ తెలిపారు.

ర్యాలీలు నిర్వహించుటకు ఎలాంటి అనుమతులు లేవ‌ని, అలాగే, రేపు వినాయక నిమజ్జనం చేసే భక్తులు సాంప్రదాయబద్ధంగా ఎటువంటి అల్లర్లు లేకుండా  చేసుకోవాల‌ని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు పాటించాల‌ని, పై నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీస్ వారు చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటార‌ని చెప్పారు.