శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్

జకోవిచ్‌కు షాక్ - యూఎస్‌ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌

అమెరికా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచి చరిత్ర సృష్టిద్దామనుకున్న నొవాక్‌ జకోవిచ్‌‌కు షాక్ తగిలింది. యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ పోరులో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్‌ సంచలనం సృష్టించాడు. వరుస సెట్లలో ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు జకోవిచ్‌ను మట్టికరిపించాడు. 
 
ఆర్థర్‌ ఆషే స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-4 తేడాతో తిరుగులేని విజయం సాధించాడు. దీంతో మొదటిసారిగా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన సొంతం చేసుకున్నాడు. 
 
దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో ఒక్కసెట్‌లో మాత్రమే ఓడిపోయి టైటిల్‌ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. మెద్వెదెవ్‌కు ఇది మూడో గ్రాండ్ స్లామ్‌ ఫైనల్‌ కావడం విశేషం. గతంలో యూఎస్‌ ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరినప్పటికీ విజయం సాధించలేకపోయాడు.