సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (10:29 IST)

దుమ్మురేపిన క్రిష్ణ నగార్.. భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం

టోక్యో పారాలింపిక్స్‌ పోటీల్లో భారత్ అథ్లెట్స్ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటారు. ఫలితంగా భారత్ ఖాతాలో వరుసగా పతకాలు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం ఉదయం 10 గంటలకే ఓ స్వర్ణ పతకం భారత్ ఖాతాలోకి వచ్చి చేరింది. పురుషుల బ్యాడ్మింటన్‌లో క్రిష్ణ నగార్ స్వరాన్ని గెలిచాడు.
 
ఆదివారం ఉదయం జరిగిన ఎస్‌హెచ్6 ఫైనల్స్‌లో హాంకాంగ్ ఆటగాడు చుమన్‌పై 21-17, 16-21, 21-17 తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్నడు. దీనితో భారత్ ఖాతాలోకి ఐదు గోల్డ్ మెడల్స్ చేరాయి. మొత్తం దేశం ఖాతాలోకి 19 మెడల్స్ వచ్చాయి.
 
అంతకుముందు బ్యాడ్మింటన్‌లో సుహాస్‌ యతిరాజ్‌ సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ ఎస్ఎల్ 4 విభాగం ఫైనల్లో ఫ్రాన్స్‌ షట్లర్‌ మజుర్‌ లుకాస్‌ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయాడు. దీంతో సుహాస్‌ రజతంతో ఇంటికి తిరిగి పయణమయ్యారు. ఈ పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 19కి చేరింది.
 
భారత్ ఆటగాళ్లు సాధించిన మొత్తం పతకాల్లో ఐదు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా, టోక్యో పారాలింపిక్స్‌ ఆదివారంతో ముగియనున్నాయి. చివరి రోజు భారత అథ్లెట్లు.. మరో మూడు పతకాల కోసం పోటీ పడనున్నారు.