బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (09:18 IST)

పారాలింపిక్స్ పోటీలు : షట్లర్ ప్రమోద్ భగత్‌కు పతకం ఖాయం

జపాన్ రాజధాని టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమయింది. షెట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ బ్యాడ్మింటన్‌‌ పురుషుల తుది పోరుకు దూసుకెళ్లాడు. జపాన్‌ ప్లేయర్‌ ఫుజిహరాతో జరిగిన ఎస్‌ఎల్‌ 3 విభాగం సెమీఫైనల్‌లో 21-11, 21-16 తేడాతో ప్రమోద్‌ విజయం సాధించాడు. 
 
దీంతో ఫైనల్‌లో గెలిచినా, ఓడినా ప్రమోద్‌కు పతకం లభించనుంది. ఇక షూటింగ్‌ పీ 4 మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్తోల్‌ ఈవెంట్‌లో మనీష్‌ నర్వాల్‌, సింఘ్‌రాజ్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు. అందేవిధంగా బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌లో మనోజ్‌ సర్కార్‌ సెమీస్‌ ఓడిపోవడంతో బ్రోన్జ్‌ పతకం కోసం పోరాడనున్నాడు.