శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 2 సెప్టెంబరు 2021 (22:53 IST)

భారతదేశానికి మరో 43 లక్షల మంది నర్సుల అవసరం ఉంది

నేడు, నాలుగు ప్రధానమైన నర్సింగ్‌ మరియు మిడ్‌వైఫరీ ప్రొఫెషనల్‌ సంస్ధలు ఏకతాటిపైకి రావడంతో పాటుగా వినూత్నమైన ప్రచారం ప్రారంభించాయి. ఈ ప్రచారం ద్వారా నర్సులు మరియు మంత్రసానిల పాత్రను ప్రధానంగా వెల్లడించడంతో పాటుగా విద్య, సేవ, నాయకత్వం ద్వారా దేశపు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు వారు అందిస్తున్న తోడ్పాటును సైతం వెల్లడిస్తుంది.
 
నర్సింగ్‌ మిడ్‌వైఫ్‌4ఛేంజ్‌ అంటూ ప్రచారం వెనుక నర్సింగ్‌ అసోసియేషన్లు, ప్రభుత్వ రంగం మరియు ఫెడరేషన్స్‌లోని ట్రేడ్‌ యూనియన్లతో కూడిన అఖిల భారత ప్రభుత్వ నర్సుల సమాఖ్య (ఏఐజీఎన్‌ఎఫ్‌); ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ రంగంలోని నర్సింగ్‌ మరియు మిడ్‌వైఫరీ ప్రొఫెషనల్స్‌తో కూడిన జాతీయ ప్రొఫెషనల్‌ సంస్థ, ట్రైన్డ్‌ నర్సెస్‌ అసొసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (టీఎన్‌ఏఐ); భారతదేశంలో మంత్రసాని వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న సంస్థ, సొసైటీ ఆఫ్‌ మిడ్‌వైవ్స్‌-ఇండియా (ఎస్‌ఓఎంఐ) మరియు భారతదేశం నర్సింగ్‌ విద్య కోసం జాతీయ నియంత్రణ సంస్థ మరియు ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌ (ఐసీఎన్‌)లో సభ్యత్వం కలిగిన ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ (ఐఎన్‌సీ) ఉన్నాయి.
 
ఈ ప్రచార ప్రారంభోత్సవ సందర్భంగా ఆల్‌ ఇండియా నర్సెస్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ జనరల్‌ శ్రీమతి ఖురానా మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ సేవల పంపిణీలో మూల స్థంభాలుగా నర్సులు మరియు మంత్రసానిలు ఉంటున్నారు. కాదనలేని రీతిలో వారి తోడ్పాటు  ఉన్నప్పటికీ, కనీస మద్దతు మరియు గౌరవం తో మొత్తం భారం మోసే ఈ దైవ దూతల త్యాగాలను మాత్రం తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాం.
 
నర్స్‌ మిడ్‌వైఫ్‌4ఛేంజ్‌ ప్రచారాన్ని భారతదేశంలోని నర్సులు మరియు మంత్రసానిల కోసం సృష్టించడంతో పాటుగా విద్యావేత్తలు, సేవా ప్రదాతలు, నిపుణులు మరియు నాయకులుగా వారు పోషించే విభిన్న పాత్రల పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా ప్రారంభించాము. ఇదే సమయంలో, ఈ అత్యంత కీలకమైన సిబ్బంది నేడు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను వెలుగులోకి ఇది తీసుకురానుంది. ఉదాహరణకు వర్కింగ్‌ కండీషన్స్‌, జీతం, సమాజంలో గౌరవం తో  పాటుగా ఈ ప్రొఫెషనల్‌ నిపుణుల అభివృద్ధి కోసం జాతీయ మరియు అంతర్జాతీయ సిఫార్సులను సైతం వెల్లడించనున్నాం’’ అని అన్నారు.
 
భారతదేశపు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలాలు, బలహీనతలను స్పష్టంగా కోవిడ్‌ మహమ్మారి వెల్లడించింది. తమ ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నప్పటికీ ఆరోగ్య సంరక్షణ కార్మికులు ప్రాణాలను కాపాడటాన్ని వేడుక చేసుకుంటున్నప్పటికీ, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ ఆరోగ్య కార్మికులకు తమ విద్య, సేవ, నాయకత్వంపై పెట్టుబడులు పెట్టాల్సిన ఆవశ్యకతను కూడా తెలిపింది. వరల్డ్స్‌ నర్సింగ్‌ ఇండియా ప్రొఫైల్‌ వెల్లడించే దాని ప్రకారం, దాదాపు 47% మంది భారతీయ ఆరోగ్య సిబ్బందిలో  నర్సులు, మంత్రసానిలు ఉన్నారు. ప్రతి 1000 మంది జనాభాకు 1.7 నర్సులు భారతదేశంలో ఉన్నప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించిన ప్రతి 1000మంది జనాభాకు ముగ్గురు నర్సులతో పోలిస్తే చాలా తక్కువ.
 
ఇటీవల విడుదల చేసిన స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్స్‌ నర్సింగ్‌ రిపోర్ట్‌ 2020 మరియు స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్స్‌ మిడ్‌వైఫరీ 2021 నివేదికల ప్రకారం, నర్సింగ్‌ మరియు మిడ్‌వైఫరీలో పెట్టుబడులు కేవలం ఆరోగ్య సంబంధిత ఎస్‌డీజీలను లక్ష్యం చేసుకోవడమే కాదు, విద్య, లింగ మరియు ఆర్ధిక వృద్ధికి సైతం తోడ్పాటునందిస్తాయి. ఈ నివేదికల ప్రకారం  భారతదేశం అత్యంత ప్రాధాన్యతనివ్వాల్సిన అంశాలలో  నాయకత్వం, విద్య, ఉపాధికల్పన ఉన్నాయి.
 
అంతర్జాతీయ ప్రచారాలైనటువంటి నర్సింగ్‌ నౌ, నైటింగేల్‌ ఛాలెంజ్‌ లా నర్స్‌మిడ్‌వైఫ్‌ 4ఛేంజ్‌ సైతం నర్సులు మరియు మంత్రసానిలు నాయకత్వం వహించడం, అభ్యసించడం మరియు తమ వృత్తిని బలోపేతం చేయడం లక్ష్యంగా చేసుకుంది.
 
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, విధాన నిర్ణేతలు, ప్రభుత్వం, పౌర సమాజం, నర్సింగ్‌ మరియు మంత్రసాని శిక్షణా సంస్థలు, ప్రైవేట్‌ మరియు కార్పోరేట్‌ రంగం, ప్రభుత్వేతర సంస్థలు మరియు ఈ దేశపు ప్రజలు సహా సమాజంలోని అన్ని వర్గాలకూ ఓ మేలుకొలుపులా ఉండటంతో పాటుగా ఈ ప్రచారం ద్వారా నర్సులు మరియు మంత్రసానిలకు మద్దతునందించాల్సిందిగా పిలుపునిస్తుంది.  తద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో  వీరి పాత్రకు తగిన గుర్తింపు లభించడంతో  పాటుగా ఈ విభాగం మరింత బలోపేతమయ్యేందుకు తగిన పెట్టుబడులకు ప్రాధాన్యత లభించడమూ జరుగుతుంది. తద్వారా వారు తమ విధులను మరింత ఉత్తమంగా చేపట్టే వీలు కలిగి, దేశం తమ ఆరోగ్య, సంక్షేమ లక్ష్యాలను చేరుకోవడంలోనూ సహాయపడుతుంది.