గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (22:38 IST)

జ‌గ‌న్‌ను కలిసిన గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు.

సిసోడియా ఇటీవల గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి కొద్దిసేపు మాట్లాడారు.

క‌రోనా నేపధ్యంలో రాజ్ భవన్‌ను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఈ సందర్భంగా సిసోడియాకు ముఖ్యమంత్రి సూచించారు. గవర్నర్ ఆరోగ్య పరిరక్షణ విషయంలో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.