సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: బుధవారం, 8 సెప్టెంబరు 2021 (10:56 IST)

మద్యం షాపులో మహిళా అధికారిణి చెకింగ్, బాక్సు తెరవగానే బుస్ బుస్ అంటూ...

ప్రభుత్వ మద్యం షాపులో తనిఖీ నిర్వహిస్తుండగా ఓ అధికారినికి బుస్ బుస్ అంటూ శబ్దాలు వినిపించాయి. ఏంటని ఓ కార్టన్ పెట్టె తెరిచే సరికి... పాము బుస్సు మంటూ పైకి లేచింది. అధికారిణిని కాటు వేసింది.
 
గుంటూరు జిల్లా దాచేపల్లి మాదినపాడు రోడ్డు లోని ప్రభుత్వం మద్యం షాపులో తనిఖీల నిమిత్తం వచ్చిన ఎక్సైజ్ అధికారిణి స్వర్ణలతకు ఈ చేదు సంఘటన ఎదురయింది. ఆమె మద్యం షాపులో తనిఖీ నిర్వహిస్తుండగా, మద్యం బాక్సులో నుండి పాము బయటకు వచ్చి కాటు వేసింది.
 
కంగారుపడిన ఎక్సైజ్ సిబ్బంది స్వర్ణలతను వెంటనే దాచేపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సకు తరలించారు. అక్కడ ఇంజక్షన్ చేయించిన  అనంతరం నరసరావుపేట తరలించారు. ప్రస్తుతం అక్కడ అధికారిణి చికిత్స పొందుతున్నట్లు  సిబ్బంది తెలిపారు.