చంద్రబాబు బావిలో దూకి చావడం బెటర్: మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు
రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని మాజీ సీఎం జగన్ అన్నారు. అన్నదాతలకు తాము ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తలెత్తనీయలేదనీ, చంద్రబాబు మాత్రం రైతులకు కష్టాలు తెస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి స్థితికి కారణమైన చంద్రబాబు నాయుడు ఏదైనా బావిలో దూకి చావడం బెటర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ వ్యాఖ్యలపై తెదేపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
జగన్ పరిపాలన ఎలా సాగిందో చెత్తపన్ను ఒక్కటి చాలనీ, ప్రజలను జలగలా పట్టి పీడించి పన్నులు రూపేణా ప్రజల ధనాన్ని పీల్చేసిన జగన్ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ మండిపడుతున్నారు. తాము ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చామనీ, అందుకే ప్రజలు కూటమి సర్కారుకి బ్రహ్మరథం పడుతున్నారంటూ మంత్రి నారాయణ వెల్లడించారు.