మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (12:30 IST)

జగన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియామకం

ఈ నెల30 వ తేదీన ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో జగన్‌కి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ని ఏపీ హోం శాఖ నియమించింది. వైఎస్.జగన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా అమర్లపూడి ‌జోషిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
ప్రస్తుతం ఏపీ సీఎం సెక్యూరిటీ వింగ్‌లో విధులు నిర్వహిస్తున్న జోషిని తిరిగి జగన్ సెక్యూరుటీ ఆఫీసర్‌గా గా బాధ్యతలు చేపట్టారు. ఇదిలావుంటే జగ‌న్‌ను కలవడానికి ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు తాడేపల్లిలోని వైకాపా అధినేత నివాసానికి క్యూకడుతున్నారు.