ఈడీ కేసులో నా భార్య ముద్దాయి.. ఆ వార్తల్ని చూసి షాకయ్యా: జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసులో తన సతీమణి వైఎస్‌ భారతి ముద్దాయి అంటూ వచ్చిన వార్తలను చూసి షాకయ్యానని జగన్ వ్యాఖ్

శనివారం, 11 ఆగస్టు 2018 (09:29 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసులో తన సతీమణి వైఎస్‌ భారతి ముద్దాయి అంటూ వచ్చిన వార్తలను చూసి షాకయ్యానని జగన్ వ్యాఖ్యానించారు. తననే కాకుండా తన కుటుంబాన్ని కూడా వదలకుండా కొందరు  వేధిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ మేరకు ఓ లేఖలో జగన్ తన కుటుంబాన్ని, తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదే అంశంపై ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన జగన్.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు లేఖ రాశారు. న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నాకే చార్జిషీట్‌లో ఏముందన్న విషయం ఎవరికైనా తెలుస్తుందని, అలాంటిది న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోకముందే ఈడీ నుంచి ఈ వార్త ఎలా తెలిసిందని జగన్ ప్రశ్నించారు. సీబీఐ విచారణలో పేర్కొనని కంపెనీలను, వ్యక్తులను ఇన్నేళ్ల తర్వాత చార్జిషీట్లలో ఎందుకు చేరుస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
 
ఏడేళ్లుగా తనను కేసులతో వేధిస్తున్నా, కోర్టుల చుట్టూ తిప్పి బాధిస్తున్నా ప్రజాక్షేత్రంలో ఏనాడూ వెన్ను చూపలేదని, ప్రజా సమస్యలపై పోరు బాటులో వెనకడుగు వేయలేదని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 

అన్నీ చూడండి

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్ రాబోతోంది

ట్రెండింగ్‌: కరుప్పు చిత్రంలో నటి త్రిష కృష్ణన్‌ ఇల్లు

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

తర్వాతి కథనం
Show comments