గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 జులై 2021 (19:42 IST)

మా నీళ్లను వాడుకుంటే తప్పేంటి?: జగన్‌

తెలుగురాష్ట్రాల మధ్య సాగుతున్న జలవిదాదంపై సీఎం జగన్ స్పందించారు. రాయదుర్గం సభలో గురువారం మాట్లాడిన ఆయన.. తెలంగాణ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కృష్ణాలో తమకు కేటాయించిన నీళ్లను వాడుకుంటే తప్పేంటన్నారు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని గుర్తు చేశారు. కృష్ణా నీటి వివాదంపై ప్రతిపక్షనేత చంద్రబాబును ఉద్దేశించి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గాడిదలు కాశారా? అని ప్రశ్నించారు.
 
881 అడుగులు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు రావని, శ్రీశైలంలో 885 అడుగుల మేర నీరు ఎన్నిరోజులు ఉందన్నారు. నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో నేనెప్పుడూ వేలు పెట్టలేదన్నారు.

రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలన్నదే తన అభిమతమన్నారు. పాలకుల మధ్య కూడా సఖ్యత ఉండాలని కోరుకుంటున్నానని సీఎ జగన్‌ అన్నారు.