ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (16:33 IST)

470 కేజీల వెండి గొలుసులతో పవన్ కళ్యాణ్ చిత్తరువు

pawan kalyan
పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సెప్టెంబరు 2వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. దీంతో ఆయన అభిమానులు తమకుతోచిన విధంగా పలు రకాలైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా, కొందరు వీరాభిమానులు కలిసి 470 కేజీల వెండితో తమ అభిమాన నేత చిత్తరువు తయారు చేశారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ రిలీజ్ చేశారు. 
 
నెల్లూరు సిటీ జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో 470 కేజీల వెండితో పవన్ కళ్యాణ్ చిత్ర రూపాన్ని రూపొందించారు. వెండి గొలుసులు ఉపయోగించి ఈ కళాకృతిని తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, జనసేన నేతలు, కొట్టే వెంకటేశ్వర్లు, సుదరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.