ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (16:57 IST)

హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు కాంబినేషన్లో తమ్ముడు సినిమా

Dil raju, sirish- nitin, venu
Dil raju, sirish- nitin, venu
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరో క్రేజీ కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో "తమ్ముడు" సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్ ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. 
 
ఈ చిత్రానికి "దంగల్, కహానీ,తారే జమీన్ పర్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పనిచేసిన సత్యజిత్ పాండే (సేతు) సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. సెప్టెంబర్ 1 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
 
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా..దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో తమ్ముడు సినిమా లాంఛ్ అవడం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.