ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (16:48 IST)

విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేస్తాను : లక్ష్మీనారాయణ

JD Lakshminarayana
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ డైరెక్టర్ జనరల్ లక్ష్మీనారాయణ తెలిపారు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తన పోటీపై ఆయన స్పందించారు. 
 
వచ్చే ఎన్నికల్లో తన ఆలోచనలకు దగ్గరగా ఉండే పార్టీ తరపున పోటీ చేస్తానని తెలిపారు. అయితే, తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానోనన్న విషయంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోందన్నారు. 
 
తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగానే ఉంటాయని అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్ర విభజన అంశం ఇపుడు సుప్రీంకోర్టులో ఉందని ఆయన గుర్తు చేశారు.