శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (09:16 IST)

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటున్న వైకాపా ఎమ్మెల్యే.. ఎందుకు?

errakota chennakeshava reddy
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై కీలక ప్రకటన చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. 
 
ఇటీవల ఎమ్మిగనూరులోని ఉప్పర సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని సీఎం జగన్ కోరారని, కానీ, తన వయసు 83 యేళ్లు అని, గుండె జబ్బు కూడా ఉందని గుర్తుచేసి పోటీ చేయలేనని చెప్పినట్టు తెలిపారు. 
 
పైగా, తాను ప్రజలతో కలిసి ఎక్కువ సేపు తిరగలేనని, ఎక్కువ సేపు మాట్లాడలేనని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, అసెంబ్లీ టిక్కెట్‌ను తన కుమారుడికి ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఒకవేళ తన కొడుక్కి టిక్కెట్ వస్తే ప్రజలంతా సహకరించి గెలిపించాలని కోరారు.