బుధవారం, 29 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2022 (13:05 IST)

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ రేవంత్ సతీమణి

revanth - anvitha
టాలీవుడ్ సింగర్ రేవంత్, అన్విత దంపతులు ఇపుడు తల్లిదండ్రులయ్యారు. రేవంత్ సతీమణి అన్విత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అన్విత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తాను ఆడబిడ్డకు జన్మినిచ్చినట్టు తెలిపింది. 
 
ప్రస్తుతం రేవంత్ బిగ్ బాస్ సీజన్-6లో ఉన్న విషయం తెల్సిందే. ఈయన హౌస్‌లోకి ప్రవేశించే నాటికే అన్విత నిండు గర్భిణి. పైగా, ఆయన హౌస్‌లో ఉన్నపుడు సీమంతం కూడా జరిరగింది. సీమంతం వీడియోను చూసిన రేవంత్ ఎంతో భావోద్వేగానికి కూడా లోనయ్యారు. 
 
తాను బాల్యంలోనే తండ్రిని కోల్పోయానని, పైగా తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసని అందుకే నాన్నా అని ఎపుడెపుడూ పిలిపించుకోవాలా అనే ఆత్రుతతో ఉన్నానని రేవంత్ బిగ్ బాస్ హౌస్‌లో కన్నీటి పర్యంతమవుతూ చెప్పాడు. ఇపుడు ఆయన కల నెరవేరింది.