గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (11:46 IST)

సింగర్ రేవంత్‌ తండ్రి కాబోతున్నాడు.. ఆమెను మిస్ అవుతున్నా..

Revanth
Revanth
సింగర్ రేవంత్‌ బిగ్‌బాస్‌ సీజన్‌6లోకి అడుగుపెట్టాడు. కాగా హౌస్‌లోకి వెళ్లేముందు ఓ ఎమోషనల్‌ పోస్టును షేర్‌ చేసుకున్న ఈ స్టార్‌ సింగర్‌.. అందులో తన సతీమణిని మిస్‌ అవుతున్నట్లు రాసుకొచ్చాడు. కొన్ని నెలల క్రితం అన్విత అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు రేవంత్‌.
 
ప్రస్తుతం అతని భార్య ఆరునెలల గర్భంతో ఉంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన రేవంత్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. 'నా భార్య ఇప్పుడు గర్భంతో ఉంది. ఇలాంటి సమయంలో తన పక్కన లేకుండా ఇక్కడకు రావడం కొంచెం బాధగా ఉంది' అంటూ స్టేజిపైనే భావోద్వేగానికి గురయ్యాడు.
 
కాగా ఇదే సమయంలో అన్విత కూడా షోలో కనిపించి భర్తకు బెస్ట్‌ విషెస్‌ చెప్పింది. ఇదిలా ఉంటే త్వరలోనే అమ్మనాన్నలుగా ప్రమోషన్‌ పొందనున్న రేవంత్‌ దంపతులకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతా మంచే జరగాలంటూ ఫ్యాన్స్, నెటిజన్లు ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.