పదేళ్ల బాలికపై తండ్రి అఘాయిత్యం..
వావి వరసలు, చిన్న పెద్ద అని మరిచిన కామాంధుల అఘాయిత్యాలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. ఇక తాజాగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణం చోటుచేసుకుంది.
పదేళ్ల బాలికపై తండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కన్న కూతురుపైనే ఇలాంటి దారుణానికి పాల్పడటం క్షమించరాని నేరమని, కఠినంగా శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్నారు.