ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (12:24 IST)

ఐదో పెళ్లికి సిద్ధమైన తండ్రిని చితక్కొట్టిన కన్నబిడ్డలు... వధువు పరార్

marriage
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్‌లో ఓ ఘటన జరిగింది. ఐదో పెళ్లికి సిద్ధమైన తండ్రిని కన్నబిడ్డను చితక్కొట్టారు. ఈ దృశ్యాన్ని చూసిన వధువు పెళ్లి పీటలపై నుంచి ప్రాణభయంతో పారిపోయింద. ఈ కేసులో తండ్రిని హత్య చేసిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని మొహల్లా పటియాకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు కాంట్రాక్టరుగా కొనసాగుతున్నారు. ఈయన మొదటి భార్యకు విడాకులిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈమెతో ఏడుగురు సంతానానికి జన్మనిచ్చాడు. 
 
గత ఆరు నెలలుగా ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత మరో రెండు పెళ్ళిళ్లను రహస్యంగా చేసుకున్నారు. ఈ విషయం రెండో భార్య సంతానికి తెలియడంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే, తనలో కామవాంఛ తీరకపోవడం, పెళ్లిళ్ళపై మోజు తీరకపోవడంతో మరో పెళ్లి అంటే ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న రెండో భార్య, ఆమె పిల్లలు బంధువులతో కలిసి పెళ్లి జరిగే కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. అప్పటికే పెళ్లికొడుకులా తయారై పెళ్లిపీటలపై కూర్చొన్న తమ తండ్రిని చూసి పిల్లలకు పట్టారని కోపం వచ్చింది. అంతే.. తండ్రిని పట్టుకుని చావబాదారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థంకా పెళ్లిపీటలపై ఉన్న వధువు కాళ్లకు పనిచెప్పింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.