ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (09:58 IST)

ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌

Rajamouli-NTR-Ramcharan
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఆర్ఆర్ఆర్ నటులు జూనియర్ ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ శుక్రవారం కలువనున్నారు. ఈ సందర్భంగా వారిద్ద‌రూ విజ‌య‌వాడ వరద బాధితులకు ప్ర‌క‌టించిన విరాళాల తాలూకు చెక్‌ల‌ను ముఖ్య‌మంత్రికి అంద‌జేయ‌నున్నారు. 
 
ఇక సీఎం చంద్రబాబు పిలుపుమేరకు వరద సాయం కోసం ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి తార‌క్‌, రామ్ చరణ్‌లు విరాళాలు ప్ర‌క‌టించిన నేపథ్యంలో వీరిద్దరూ ఏపీకి చెరో రూ.50 లక్షలు చొప్పున విరాళం అందిస్తామ‌ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. 
 
చాలాకాలం తర్వాత సీఎం చంద్ర‌బాబుతో ఎన్‌టీఆర్ భేటీ కానుండ‌డం సర్వత్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఉండవల్లి నివాసంలో చంద్రబాబును శుక్రవారం ఉదయం 11 గంటలకు వీరి భేటీ వుంటుంది.
 
ఇకపోతే.. ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం.. దేవర పార్ట్-1. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అతని సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.  రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా విడుదలకు సిద్ధం అవుతోంది.