ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (16:10 IST)

గృహాల క్లీనింగ్ కోసం సింగ్ నగర్‌కు చేరుకున్న ఫైరింజిన్లు (Video)

fire engine
రాష్ట్రం నలు మూలల నుంచి విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‍‌ ప్రాంతానికి భారీ సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. వరద ముంపు తగ్గిన ఇళ్లను, ఫైర్ ఇంజిన్ల ద్వారా శుభ్రం చేయించే బాధ్యతను ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 
 
వైకాపా పాలకుల పాపాలే ఇపుడు ఏపీకి శాపాలా? 
 
గత ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన పాపాలే ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపాలుగా పరిణమించాయని పలువురు పర్యావరణ నిపుణులు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నది. ఆ సమయంలో వైకాపా నేతలు ప్రకృతితో చెలగాటమాడారు. ఆ పాపాలు ఇపుడు రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయి. 
 
వైకాపా నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. గతంలో జగన్ రెడ్డి ఇసుక మాఫియాకి అన్నమయ్య డ్యాం బలైపోయిందనీ, ఇపుడు జగన్ రెడ్డి ముఠా కబ్జాకి గురైన బుడమేరు వల్ల విజయవాడ మునగటం జరిగిందిని వారు అంటున్నారు. రేపు విశాఖపట్టణం మునిగిపోవడం ఖాయమని అంటున్నారు. దీనికి కారణం గత ఐదేళ్ల వైకాపా పాలనలో విశాఖపట్టణాన్ని మొత్తం వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు. 
 
అధికారాన్ని అడ్డుపెట్టుకున్న వైకాపా నేతలు.. సహజవనరులని, తమ సొంతానికి వాడుకున్నారు. విశాఖ సముద్ర తీరాన్ని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి రాసిచ్చారు. భీమిలి బీచ్ వద్ద, సముద్రాన్ని ఆనుకుని, సాయిరెడ్డి కూతురు భారీ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. కోస్టర్ రెగ్యులేటరీ రీజనల్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను హైకోర్టు ఆదేశాలు ప్రకారం మంగళవారం జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. 
 
హైకోర్టు ఆదేశాలు ప్రకారం, నోటీసు ఇచ్చినా కనీసం లెక్క చేయకుండా స్పందించకపోవటంతో, హైకోర్టు ఆదేశాలు అనుసరించి, సముద్రం ఒడ్డున కట్టిన నిర్మాణాలు పూర్తిగా నేలమట్టం చేశారు. ఇలా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రకృతిని నాశనం చేసిన జగన్ రెడ్డి గ్యాంగ్ పాపాలు, రాష్ట్ర భవిష్యత్తు తరాలకు శాపాలుగా మారాయని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.