గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2024 (16:54 IST)

వాస్తు ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో ఇంటిని శుభ్రం చేస్తే?

cleaning
వాస్తు ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో ఇంటిని శుభ్రం చేసుకోవడం మంచి సమయంగా పరిగణింపబడుతోంది. సూర్యోదయానికి గంటన్నర ముందుగానే ఇల్లు, ఇంటి పరిసరాలను శుభ్రం చేయటం వల్ల ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. 
 
ఇది రోజంతా ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. సూర్యోదయం సమయానికి పరిసరాలను శుభ్రం చేసుకోవటం కూడా ఇంటి పురోగతికి ప్రయోజనకరం. బ్రహ్మముహూర్త కాలంలో ఇంటిని తుడుచుకోవటం, పరిసరాలను శుభ్రం చేసుకోవటం వల్ల మొత్తం ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
 
అలాగే, వాస్తు శాస్త్రం ప్రకారం, పట్టపగలు సమయంలో ఇంటిని తుడుచుకోవడం మంచి పద్ధతి కాదు. మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడని, ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదంటారు. 
 
ఈ సమయంలో ఇంట్లోకి వచ్చే సౌరశక్తి పూర్తి ప్రయోజనం పొందలేరు. అలాగే శుభ్రమైన , చక్కగా ఉంచుకునే ఇల్లు, ఆ ఇంట్లోని వారికి ఆరోగ్యం, సంపద, ఆనందాన్ని ప్రోత్సహిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు.