సంబంధిత వార్తలు
- వాస్తు: పూజగదిలో ఎండిపోయిన పువ్వులు వుంచకూడదట..
- పోర్న్ స్టార్‌కు డబ్బులు ఇచ్చిన కేసులో దోషిగా తేలిన డోనాల్డ్ ట్రంప్!!
- కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!
- వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి రూ.9,900 కోట్లు ... ఖాతాపై ఎన్.పి.ఏ నిషేధం
- ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా
ఎంగిలితో చేతి వేళ్లను తడిపి డబ్బును లెక్కిస్తున్నారా?
Money
ముందుగా ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు లక్ష్మీదేవిని ఆరాధించడం మరిచిపోకూడదు. లక్ష్మీదేవి ఆరాధనతో డబ్బు కొరత రాదు. అలాగే విష్ణువు, లక్ష్మి దేవిని ప్రతిరోజూ పూజిస్తే ఈతిబాధలు వుండవు. అయితే ఈ తప్పులు చేస్తే జీవితంలో ఆర్థిక చిక్కులు ఎదుర్కోక తప్పదని వాస్తు శాస్త్రం చెప్తుంది.
ఎంగిలితో తడిపి డబ్బును లెక్కించకూడదు.. ఎంగిలితో వేళ్ళను తడిపి డబ్బును లెక్కించకూడదు. ఇది లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు లెక్క. ఇంకా డబ్బుని మడతపెట్టకూడదు. పర్సులో కూడా డబ్బును మడతపెట్టి వుంచరాదు.
అలాగే ఎక్కడ పడితే అక్కడ డబ్బును ఉంచకూడదు: కొంతమంది డబ్బును ఎక్కడపడితే అక్కడ వుంచుతారు. అలా చేయడం తప్పు. ఇది ప్రతికూల ప్రభావాన్నిస్తుంది.
ఇతర వస్తువులను ఉంచడం: డబ్బు ఉంచే స్థలంలో ఇతర వస్తువులను ఉంచడం సరైనది కాదు.
తలకు దగ్గర ఉంచుకోకూడదు: రాత్రి నిద్రపోయేటప్పుడు దిండుకింద, తలకు దగ్గర డబ్బును ఉంచుకొని నిద్రపోకూడదు. డబ్బు ఉంచే స్థలంలో మాత్రమే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
