శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: మంగళవారం, 19 మార్చి 2019 (15:05 IST)

డబ్బులు తీసుకోనిస్తారా లేదా? బ్యాంకు ముందు కె.ఎ పాల్ బైఠాయింపు

విశాఖలో ప్రముఖ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్చల్ చేసాడు. జైల్ రోడ్డు వద్ద ఉన్న స్టేట్‌బ్యాంక్ వద్ద కేఏ పాల్ అనుచరులతో కలిసి హడావుడి చేసాడు. తన సొసైటీ పేరుతో అకౌంట్లో డబ్బులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే అతని ఖాతా ఫ్రీజ్ అయిందని, ఉన్నతాధికారుల ఆదేశం లేనిదే లావాదేవీలు జరపకూడదని బ్యాంకు అధికారులు చెప్పినప్పటికీ పాల్ వినలేదు.
 
సొసైటీకి తానే అధ్యక్షుని సొసైటీ తనదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని బ్యాంకు అధికారులకు పాల్ చెప్పారు. తన ఖాతాకు సంబంధించి కోర్టు స్టే ఉందని ఆయన చెప్పారు. అయితే పాల్‌కు డబ్బులు ఇవ్వాలంటే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని అధికారులు చెప్పారు. "ఇప్పటి వరకూ మీకు డబ్బులివ్వాలని ఆదేశాలు రాలేదు కాబట్టి ఇచ్చే ప్రసక్తే లేదు" అని బ్యాంకు అధికారులు పాల్‌కు స్పష్టం చేశారు.