గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (08:10 IST)

మెడికల్ హబ్ గా కడప జిల్లా: ఉపముఖ్యమంత్రి

కడప జిల్లాను మెడికల్ హబ్ గా అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ బాషా పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ భాష, మాజీ మేయర్ సురేష్ బాబుతో కలిసి 3వ డివిజన్ వడ్డే కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజచేశారు.
 
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కడపనగర అభివృద్ధిలో భాగంగా మూడవ డివిజన్ వడ్డెకాలనీలో 11 లక్షలతో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. గతంలో అభివృద్ధికి నోచుకోని కడపనగరం  మన మనఅందరి అదృష్టంవల్ల మనజిల్లా ముద్దుబిడ్డ మనప్రియతమ నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగిందన్నారు.

దీంతో నగరాన్ని ఆదర్శనగరంగా అభివృద్ధిచేయడం జరుగుతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలప్రజలకున్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రివర్యులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా మొదటి సంవత్సరంలోనే 90% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అదిఒక  జగన్ ప్రభుత్వమే అనిచెప్పవచ్చున న్నారు. నేడు  కుల మత వర్గ ప్రాంత భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలువారి ముంగిటకు చేర్చడం జరుగుతుందన్నారు.
 
గతంలో అవ్వాతాతలు పెన్షన్లు తీసుకోవాలంటే ఉదయం 5 గంటల నుంచే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడేదన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీ ఉదయం 10 గంటల లోపల అవ్వాతాతలకు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నారు.

నాడు -నేడు కార్యక్రమంద్వారా ప్రభుత్వ పాఠశాలలో అన్నిమౌలిక వసతులు ఏర్పాటుచేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటుచేసి విద్యార్థులకు  నాణ్యమైన  విద్యను అందించడంతో నేడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు.

దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 120 కోట్ల రూపాయలతో 200 ఎకరాలలో రిమ్స్ ఆస్పత్రి నిర్మించడం జరిగిందన్నారు. నేడు ఆయన తనయుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రిమ్స్ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గా అభివృద్ధి చేసేందుకు గత డిసెంబర్ లో 170 కోట్ల రూపాయలతో వివిధ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.

గతంలో గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే తిరుపతి హైదరాబాద్ చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే వారని అలా కాకుండా మన ప్రాంతంలోని ప్రజలకు అన్ని వైద్య సేవలు అందించేందుకు రిమ్స్ ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గాఅభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.50 కోట్ల రూపాయలతో క్యాన్సర్ ఆసుపత్రి, 44 కోట్ల రూపాయలతో మానసిక వ్యాధులకు సంబంధించిన ఆసుపత్రి, డాక్టర్ ఎల్ వి  ప్రసాద్ కంటి ఆసుపత్రి, నిర్మించి కడప జిల్లాను మెడికల్ హబ్ గా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
                     
పాతకడప చెరువు 55 కోట్ల రూపాయలతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పాత కడప చెరువు నందు మంచి ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటుచేసి అన్ని హంగులతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఒక సంవత్సర కాలంలో పాతకడప చెరువు పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇక్కడ కడప జిల్లాకు సేవలందించిన మహనీయుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

కడప నగరం కార్పొరేషన్ అయినప్పటికీ వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి నీరు చేరుతుందన్నారు. లోతట్టు ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేసి వరదనీరు అంతా బయటికివెళ్లే విధంగా లోతట్టు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు.

కడప నగరంలో  ఏడురోడ్లు వెడల్పు చేయడం జరుగుతుందని ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయం సమీపంలోని రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయన్నారు. మిగతా ఆరు రోడ్ల వెడల్పు పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. కడప నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నగరంలోని మూడవ డివిజన్కు సంబంధించి రెండు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా బీసీలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ 136 బిసి కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్ లు ఏర్పాటు చేయడంజరిగిందన్నారు.56 కార్పొరేషన్ చైర్మన్ గా నిలుస్తూ ఒక్కొక్క  కార్పొరేషన్లో 12 మందిని డైరెక్టర్గా నియమించడం జరిగిందన్నారు. మంత్రి పదవులలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 60 శాతం మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగిందన్నారు.

నేడు బిసి సోదరీ సోదరీమణులు అందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. మహిళలకు సంబంధించి అన్ని పదవులలో  50 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. మహిళా సాధికారత సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రివర్యులు అన్ని రంగాలలో మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తు ముందుకు వెళ్తున్నారన్నారు.