సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (12:06 IST)

కాకినాడలో పులి మళ్లీ కలకలం.. ఆవును మింగేసింది...

tigeer
కాకినాడ జిల్లాలో పులి మరోమారు కలకలం సృష్టించింది. గత నెల రోజులుగా పులి సంచారంతో స్థానికులతో పాటు అటవి సిబ్బందికి కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి రౌతులపూడి మండలంలో ఈ పులి మరోమారు సంచరించినట్టు స్థానికులు గుర్తించారు. దీంతో ఆ పులి కోసం స్థానిక ప్రజలతో పాటు అటవీ సిబ్బంది చర్యలు చేపట్టారు. అదేసమయంలో అటవీ ప్రాంతంలోకి మేతకు వెళ్ళిన పులి దాడి చేసి చంపి ఆరగించింది. 
 
దీంతో అటవీ అధికారుల బృందం ఎస్.పైడిపాల, పెనుగొండ పరిసర ప్రాంతాల్లో పులి జాడ ఆనవాళ్ల కోసం ఆన్వేషిస్తున్నారు. బిళ్లలొద్ది, తోటమానిలొద్దిలో పులి అడుగులు కనిపిస్తున్నాయి. అడవి మీదుగా అనకాపల్లి జిల్లా సరుగుడు, నర్సీపట్నం వైపు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల ఈ పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేశారు.