1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (13:56 IST)

ఎందరు 'భీమ్లా నాయక్‌'లు వచ్చినా నన్నేమీ చేయలేరు.. ద్వారంపూడి

పద్ధతి మార్చుకోకపోతే కాకినాడ వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌కు "భీమ్లా నాయక్" ట్రీట్మెంట్ ఇస్తానంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. దీనికి ద్వారంపూడి మంగళవారం కౌంటర్ ఇచ్చారు. కాకినాడలో తననేమీ చేయలేరన్నారు. ఎంతమంది భీమ్లా నాయక్‌లు వచ్చినా తననేమీ చేయలేరని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సినిమాలు, రాజకీయాలు అనేవి వేర్వేరని పవన్ గుర్తించాలని హితవు పలికారు. పైగా, సంవత్సరానికొకటి ఇలాంటి సభలు పెట్టడం ద్వారా వచ్చే పబ్లిసిటీతో ప్యాకేజీలు మాట్లాడుకోవడం పవన్‌కు అలవాటేనని చెప్పారు. 
 
ఆయన అందరికీ నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకే అపారమైన నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. 
 
పవన్ కళ్యాణ్ తన జోలికి వస్తే ఏమాత్రం క్షమించే ప్రసక్తే లేదన్నారు. తాము పవన్ వంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ ఇంటిపైకి వస్తే చేతులు ముడుచుకుని కూర్చోబోమని, పైగా, తమను కాకినాడలో ఏమీ చేయలేరని ఆయన అన్నారు.