ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 7 జనవరి 2018 (18:07 IST)

కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయ్.. బాబు సీరియస్

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవమేనని పోలీసులు విచారణలో తేల్చారు. అంతేగాకుండా ఈ ఘటన వెనుక ఈఓ సూర్యకుమార్ పోలీసులు గుర్తించారు. దుర్గమ్మ గుడిలోని తాంత్రిక శక్తులను నిద్రలేపేం

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవమేనని పోలీసులు విచారణలో తేల్చారు. అంతేగాకుండా ఈ ఘటన వెనుక ఈఓ సూర్యకుమార్ పోలీసులు గుర్తించారు. దుర్గమ్మ గుడిలోని తాంత్రిక శక్తులను నిద్రలేపేందుకు ప్రత్యేక పూజలు చేశారని.. ఇంకా మహిషాసుర మర్దిని అలంకరణ కూడా చేశారని తేలింది. ఈ వ్యవహారం అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని పోలీసుల విచారణలో తేల్చారు. 
 
డీసీపీ కాంతి రాణా టాటా నేతృత్వంలోని బృందం ఈ విచారణ జరిపి, 20 మందిని విచారించగా, వారిలో ముగ్గురు ప్రత్యేక పూజలు తాము జరిపినట్టు అంగీకరించగా, వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ విచారణ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పోలీసు అధికారులు నివేదికను సమర్పించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కాగా, డిసెంబర్ 26 రాత్రి అమ్మవారి కవచాన్ని తొలగించి మహిషాసుర మర్దినిగా అలంకరించి పూజలు చేశామని, ఆపై సాధారణ అలంకారం చేశామని పూజ చేసిన వ్యక్తి చెప్పాడు. అయితే, అలంకరణ కుదరకపోవడంతో, మరుసటి రోజు ఉదయం 9 గంటల తరువాత దర్శనం నిలిపివేసి, సరిచేశామని సుజన్ అనే పూజారి వెల్లడించినట్టు చెప్పారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇలాంటి చర్యలు రాష్ట్రంలో ఇతర ఆలయాల్లో జరగకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పోలీసు శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా ఈఓ సూర్యకుమారిపై మండిపడ్డారు.
 
కాగా.. గత కృష్ణా పుష్కరాలకు ముందు 2016 జులైలో సూర్యకుమారి ఈవోగా బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి సరిగ్గా ఏడాదిన్నర ఈవోగా విధులు నిర్వహించారు. దుర్గగుడిలో భక్తులకు సౌకర్యాలు పెంచి, సేవల ధరల భారం తగ్గించాల్సింది పోయి భారీగా భరించలేని విధంగా పెంచేశారు.  ఒక్క ప్లేట్‌ కలెక్షన్లను అరికట్టి.. ఆలయ ఆదాయం పెంచడం తప్ప మిగతా విషయాలన్నింటిలోనూ విఫలమయ్యారు. దీంతో దుర్గగుడి కార్యనిర్వహణాధికారి సూర్యకుమారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.