సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (14:24 IST)

ఈ శునకానికి తెలివి ఎక్కువ (వీడియో)

పెంపుడు జంతువుల్లో ఒకటైన శునకాలను విశ్వాసానికి మారుపేరు చెప్తారు. ఆ శునకాలు మానవుని భాషను అర్థం చేసుకుని మెలగగలవు. యజమానులు నేర్పించే విషయాలను నేర్చుకుంటాయి. విషయాన్ని అర్థం చేసుకోవడం, సందర్భానుసారంగా

పెంపుడు జంతువుల్లో ఒకటైన శునకాలను విశ్వాసానికి మారుపేరు చెప్తారు. ఆ శునకాలు మానవుని భాషను అర్థం చేసుకుని మెలగగలవు. యజమానులు నేర్పించే విషయాలను నేర్చుకుంటాయి. విషయాన్ని అర్థం చేసుకోవడం, సందర్భానుసారంగా నడుచుకోవడం శునకాలకు పెట్టిన విద్య. అలాంటి శునకాల్లో ఓ తెలివి గల శునకం చలికాలంలో మంచు కుప్పలపై ఆడుకుంది.
 
ఆస్ట్రేలియాకు చెందిన ఈ శున‌కం మంచుపై స్లెడ్జింగ్ ప్యాడ్ మీద ఎక్కి మంచు మీద జారుతూ ఎంజాయ్ చేసింది. ఇందులో విశేషం ఏంటంటే... ఆ కుక్కే స్వ‌యంగా స్లెడ్జింగ్ ప్యాడ్‌ను మోసుకుని పైకి తెచ్చుకుంది. మంచుకు అనువుగా బ్యాలెన్స్ చేసుకుంటూ కిందికి వచ్చింది. ఈ విన్యాసం చాలామందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం వీడియో కూడా వైరల్ అవుతోంది. 
 
ఇక ఆ శునకం పేరెంటంటే.. సీక్రెట్. అది చేసే తెలివైన అల్ల‌రి ప‌నుల‌న్నింటినీ దాని య‌జ‌మాని మేరీ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తుంటుంది. మేరీ షేర్ చేసిన వాటిలో ఈ స్లెడ్జింగ్ వీడియో వైర‌ల్‌గా మారింది. డిసెంబ‌ర్ 29న ఈ వీడియో పోస్ట్ చేయ‌గా, ఈ వీడియోకు 202,563 వ్యూస్ వచ్చాయి. లైకులు, షేర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి.