శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (17:10 IST)

ఎన్నికల్లో గెలిచామని పొంగిపోవద్దు.. అహంకారానికి పోవద్దు.. కేసీఆర్

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గెలిచామని పొంగిపోవద్దని.. అహంకారానికి పోవద్దని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎలాంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని.. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. డబ్బుల పంపిణీ మినహా.. తెలంగాణలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. 
 
ఈ విజయం తెలంగాణ ప్రజలదేనని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో మళ్లీ పట్టం కట్టిన ప్రజలకు మేలు చేయాలని.. తెలంగాణ రైతులకు ఎలాంటి బాధ లేకుండా చేస్తామన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలు పచ్చబడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 
 
కులవృత్తులను కుదుటపడేలా చేస్తామని, ఉద్యోగ ఖాళీలను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తామన్నారు. విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కేసీఆర్ వెల్లడించారు.