శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (12:54 IST)

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతం సవాంగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా పని చేసిన గౌతం సవాంగ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఏపీ సీఎంగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీజీపీగా గౌతం సవాంగ్‌‌ను నియమించారు. అప్పటి నుంచి ఆయన రాష్ట్ర డీజీపీగా వైకాపా నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన్ను బదిలీ చేసింది. 
 
అయితే, ఆయనను అవమానకరరీతిలో సాగనంపిందని తీవ్రస్థాయిలో విమర్శళు వెల్లువెత్తుతున్న విషయం తెల్సిందే. అయితే, గురువారం ఆయనకు ఏపీ ప్రభుత్వం పదవిని ఫిక్స్ చేసింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉదయం సంబంధించి ప్రతిపాదనలను గవర్నర్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపింది. 
 
అయితే, గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్ట్ నుంచి సవాంగ్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్న ఉదయభాస్కర్ పదవీకాలం ఆరు నెలల క్రితం ముగిసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ ఖాళీగానే వుంది. ఈ నేపథ్యంలో సవాంగ్‌ను ఛైర్మన్‌గా నియమించింది.