ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (14:10 IST)

మైనర్ బాలికపై మాజీ సర్పంచ్ అత్యాచారం..

అతను ఒక మాజీ సర్పంచ్ అయినప్పటికీ ఆయన మాత్రం తనలోని వక్రబుద్ధిని బయటపెట్టారు. దీంతో తన ఇంటి పక్కనే ఉండే 12 సంవత్సరాల బాలిక మీద అత్యాచారయత్నం చేశాడు. దీంతో బాలిక బంధువులు అంతా కలిసి దేహశుద్ధి చేశారు. అంతేకాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబీకులు మాజీ సర్పంచ్ ఇంటిని చుట్టు ముట్టారు. 
 
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చెందిన మాజీ సర్పంచ్ కోటిరెడ్డి తన ఇంటి పక్కనే ఉండే కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలికపై నిరంతరం అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. గురువారం బాలిక తల్లిదండ్రులు గమనించి బంధువుల సహకారంతో కోటిరెడ్డి దేహశుద్ధి చేశారు. వారి దెబ్బలకి కోటికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
పోలీసులు వచ్చిసర్ది చెప్పటానికి ప్రయత్నించినప్పటికీ బాధితులు ఆగ్రహం చల్లారలేదు. మరిన్ని బలగాలతో పోలీసు సంఘటనా స్థలానికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.