శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (16:29 IST)

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య.. శవం లభించక...

murder
ఇటీవలికాలంలో కొందరు తమ ప్రియుల కోసం భర్తలను, ప్రియురాళ్ల కోసం భార్యను హత్య చేస్తున్నారు. ఈ తరహా హత్యలు తరచుగా తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఖమ్మంలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. మృతదేహాన్ని ఖమ్మం నుంచి ఆంధ్రాకు తీసుకొచ్చి ఓ చేపల చెవురులో పడేసింది. ఆ చేపల చెరువు యజమాని ఆ శవాన్ని వాగులో పడేశాడు. దీంతో ఆ శవం ఇపుడు ఎక్కడుందో కనిపించలేదు. దాని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎంతకీ ఆ శవం లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం అర్బన్ మండలం వైఎస్ఆర్ నగర్‌కు చెందిన సాయి చరణ్ (28) అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి సంతోషంగా జీవిస్తూ వచ్చారు. ఈ క్రమంలో సాయి చరణ్ వద్ద పని చేసే ఓ యువకుడితో అతని భార్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఓ రోజున వారిద్దరూ కలిసివుండటాన్ని సాయిచరణ్ కళ్లారా చూశాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 
 
దీంతో తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేలా భార్య ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఖమ్మ నగరంలోని త్రీటౌన్ పరిధిలోని ప్రకాశ నగర్ వంతెన వద్ద మద్యం సేవించే సమయంలో సాయి చరణ్‌ను హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని చేపల వ్యర్థాలు తరలించే డ్రమ్ముల్లో ఏపీలోని విజయవాడ - తిరుపూరు మధ్యలో ఉన్న చీమలపాడు సమీపానికి తరలిచారు. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అయితే పోలీసులకు మృతుని భార్యపై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. దీంతో ఆమెతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేయగా, మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతదేహం ఏపీలో పడేయడంతో ఇక్కడి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.