గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (10:06 IST)

ఎస్‌జెఆర్‌వో కృష్ణా జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొంకిమ‌ళ్ళ శంక‌ర్

సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్(ఎస్‌జెఆర్‌వో) కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొంకిమ‌ళ్ళ శంక‌ర్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్కా సాయిబాబు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఈ సంద‌ర్భంగా నియామకపు పత్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్‌, జిల్లా ఎస్పీ ర‌వీంద్ర‌‌నాధ్‌‌‌కు పంపించారు. అలాగే త్వరలో పూర్తి స్థాయి జిల్లా కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

శంక‌ర్ క్రమశిక్షణతో పాటు పాత్రికేయ ‌విధి నిర్వ‌హ‌ణ‌లో అంకిత‌భావంతో ప‌నిచేయ‌డం, ప్ర‌జాసమస్యలపై పూర్తి అవగాహన క‌లిగి ఉండ‌డం, సామాజిక బాధ్య‌త‌గా ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం వంటి అంశాల‌ను గుర్తించి రాష్ట్ర కమిటీ శంక‌ర్‌కు బాధ్యతలు అప్పగించిన‌ట్లు జ‌క్కా సాయిబాబు పేర్కొన్నారు.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూ వాటి ప‌రిష్కారం కోసం ‌ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లాల‌ని ఎస్‌జెఆర్‌వో జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నికైన శంక‌ర్‌కు సూచించారు.