శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (16:30 IST)

కృష్ణా జిల్లాలో విషాదం : గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసెలు దగ్దం

కృష్ణా జిల్లాలోని తోటవల్లూరు మండలం, గరికపర్రు అనే గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అనేక పూరి గుడిసెలు కాలిపోయాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. 
 
స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల మేరకు... ఈ గ్రామానికి చెందిన మేకల వీరమ్మ అనే మహిళకు చెందిన పూరిగుడిసెలో గ్యాస్ పొయ్యిపై పాలుబెట్టి బయట పనులు చేసుకుంటుంది. ఆ సమయంలో గ్యాస్ లీకై మంటలు గుడిసెకు అంటున్నాయి. దీంతో ఆమె భయపడి తన బిడ్డను తీసుకుని బయటకు పరుగెత్తింది. 
 
ఇంతలోనే గ్యాస్ బండ పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఆ గుడిసెకు పక్కనే ఉన్న అనేక గుడిసెలకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ గుడిసెల్లో ఉన్న వారంతా ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ మంటలను ఆర్పేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింద. 
 
ఫలితంగా అనే గుడిసెలు కాలిపోయాయి. నాలుగు కుటుంబాలకు చెందిన ప్రజలు కేవలం కట్టుబట్టలతో మిగిలారు. ఈ అగ్నిప్రమాదం వల్ల రూ.5 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించివుడొచ్చని అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.