బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Modified: ఆదివారం, 31 అక్టోబరు 2021 (20:16 IST)

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం: ప్ర‌ముఖ బాలివుడ్ న‌టీమ‌ణి, మిసెస్ ఇండియా వ‌ర‌ల్డ్ వైడ్ ఈస్ట్-2018 ఆకాంక్ష మంగ్లాని

విజ‌య‌వాడ‌: ఇంద్ర‌కీలాద్రిపై కొలువుదీరిన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డం త‌న పూర్వ‌జ‌న్మ సుకృతం అని ప్ర‌ముఖ బాలివుడ్ న‌టీమ‌ణి  మిసెస్ ఇండియా వ‌ర‌ల్డ్ వైడ్ ఈస్ట్-2018 ఆకాంక్ష మంగ్లాని ఆనందం వ్యక్తం చేశారు.


గుంటూరులోని ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆకాంక్ష మంగ్లానీ ఆదివారం ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న అనంత‌రం ఆకాంక్ష మంగ్లానీకి ఆల‌య వేద‌పండితులు ఆశీర్వ‌చ‌నం ప‌లికి, అమ్మ‌వారి కుంకుమ‌, ప్ర‌సాదాలు అంద‌జేశారు.


ఈ సంద‌ర్భంగా ఆకాంక్ష మంగ్లానీ మీడియాతో మాట్లాడుతూ... ఈ ఏడాది కెఫి మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్‌పై ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ చిత్రాల‌ను నిర్మించేందుకు ఆయా సంస్థ‌ల‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలిపారు.


అమ్మ‌వారి ద‌య ఉంటే అన్ని ప్రాజెక్టులు విజ‌య‌వంత‌మై త‌న‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపును దుర్గ‌మ్మ ప్ర‌సాదిస్తుంద‌ని పేర్కొన్నారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ఆకాంక్ష మంగ్లానీతో పాటు రీసెర్చ్ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత చైత‌న్య జంగా త‌దిత‌రులు పాల్గొన్నారు.