శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 మే 2020 (10:14 IST)

హైదరాబాద్‌ హైవేలో కనిపించిన చిరుతపులి.. అడవుల్లోకి వెళ్ళిపోయింది..

హైదరాబాద్‌ హైవేలో పడివున్న చిరుత పులి ఆపై కనిపించకుండా పోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చిరుత ఆచూకీ కోసం అటవీ శాఖాధికారులు వెతుకులాట ప్రారంభించారు. రెండు రోజులుగాచిరుత జాడ కోసం వెతికినా కనిపించలేదన్నారు. 
 
మూడు బృందాలుగా ఏర్పడి కెమెరాలు, డ్రోన్లతో కూడా గాలించారు. చివరకు హిమాయత్ సాగర్ వద్ద ఉన్నట్టు తేలడంతో అక్కడికి వెళ్లి దాని అడుగుల కదలికల ఆధారంగా అడవిలోకి వెళ్లిందని చెప్పారు. ముందు జాగ్రత్తగా బోన్లు, వలలు కూడా ఏర్పాటు చేశారు. చిలుకూరు వైపు ఎక్కువగా ఫాం హౌజులు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర శివారుల్లో హడలెత్తించిన చిరుత మరోసారి కనిపించింది. రాజేంద్రనగర్‌లోని హిమాయత్ సాగర్ వద్ద నీళ్లు తాగుతుండగా స్థానిక మత్సకారులు చూసి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుత ఆనావాళ్లను సేకరించారు. దీని ఆధారంగా అది చిలుకూరులోని అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు చెబుతున్నారు. 
 
అటవీ మార్గం పట్టడంతో నగర వాసులు ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. అయితే చిరుత పూర్తిగా అడవిలోకి వెళ్లిపోయే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.