శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (15:12 IST)

ప్రపంచ బ్యాంకు భారీ ఆర్థిక సాయం.. అతిపెద్ద లబ్ధిదారుగా భారత్‌

corona
ప్రపంచ బ్యాంకు భారత్‌కు ఆర్థిక సాయం ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక భద్రత ప్యాకేజి కింద భారత్‌కు 1 బిలియన్ డాలర్లు (రూ.7,549 కోట్లు) ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించింది. భారత ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల కోసం ఈ నిధులు ఇస్తున్నట్టు ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ప్రపంచబ్యాంకు భారత్‌తో మూడు రంగాల్లో భాగస్వామిగా ఉండనుంది. 
 
ఆరోగ్యం, సామాజిక భద్రత, సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమల రంగంలో భారత్‌కు దన్నుగా నిలవాలని బ్యాంకు భావిస్తోంది. ఈ మేరకు ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్ (భారత్) జునైద్ అహ్మద్ తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద ప్యాకేజీ అని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దీంతో భారతదేశం అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచింది. కోవిడ్‌​-19, లాక్‌డౌన్‌  వలస కార్మికుల తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ఈ ప్రకటన ఊరట నిచ్చింది.
 
ఇకపోతే.. కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికిగాను భారత్‌కు ఏప్రిల్ ప్రారంభంలో 1 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.  తాజాగా మరో బిలియన్‌ డాలర్లు అందివ్వనుంది.