శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 మే 2020 (12:53 IST)

ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 48 పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,256 నమూనాలు పరీక్షించగా 48 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,100కి చేరింది.

కరోనాతో ఇవాళ కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 48కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1192 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 860 మంది చికిత్స పొందుతున్నారు.
 
గడిచిన 24 గంటల్లో 50 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. గుంటూరులో 21 మంది, కర్నూలులో 19 మంది, అనంతపూర్‌లో 3 మంది, చిత్తూరులో 3 మంది, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, కృష్ణ, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 1192కి చేరిందన్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కర్నూల్ లో ఒకరు మరణించారు. ఇప్పటివరకూ కోవిడ్ వల్ల మరణించినవారి సంఖ్య 48కి చేరింది.