శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (19:00 IST)

లాక్ డౌన్- మాస్కుల్లేవ్, సోషల్ డిస్టన్స్ లేదు..

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే కర్నాటకలోని రామనగర జిల్లాల్లో జాతర జరుగుతోంది. కొలగండనహల్లి గ్రామంలో గుడి వద్ద జాతరను నిర్వహించారు. మాస్కులు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా... ఊరి జాతరలో వేలాది మంది పాల్గొన్నారు. 
 
ఊరంతా గుంపుల గుంపులుగా అమ్మ వారి ఆలయానికి వెళ్లారు. మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత పూజలు చేసి.. నైవేద్యం సమర్పించి.. అనంతరం ప్రత్యేక కార్యక్ర్రమాలు కూడా నిర్వహించారు. 
 
ఇంత జరుగుతున్నప్పటికీ ఏ అధికారీ పట్టించుకోలేదు. అయితే ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి అనుమతి ఇచ్చారని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ఈ క్రమంలో తహశీల్దార్ ఆదేశాల మేరకు విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ను రామనగర డిప్యూటీ కమిషనర్ సస్పెండ్ చేశారు. మరోవైపు కర్ణాటకలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. కొత్తగా 69 కేసులు నమోదైనాయి. బెంగళూరు, మండ్యాల్లో 13 కేసులు నమోదైనాయి.