శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (06:17 IST)

రెడ్‌జోన్‌ ప్రాంతాలకే లాక్‌డౌన్‌ పరిమితం:జగన్‌

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రెడ్‌జోన్‌ ప్రాంతాలకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సూచించారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన మండలాల్లో 37 రెడ్‌జోన్‌లో, 44 మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయని, మొత్తంగా 676 మండలాల్లో 81 మండ లాలు రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నట్లు ప్రధానికి వివరించారు.

మిగిలిన 595 మండలాలు గ్రీన్‌జోన్లో ఉన్నాయని, వీటిపై ప్రస్తుతానికి కరోనా ప్రభావం లేదని తెలిపారు. అందుకే రెడ్‌ జోన్ల్‌కే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. 
 
ఆ వ్యాఖ్యలు బాధాకరం: ఎంపీ రామ్మోహన్ నాయుడు
సీఎంల సమావేశంలో జగన్ వ్యాఖ్యలు బాధాకరమని రామ్మోహన్ నాయుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా పట్ల ఏమాత్రం తీవ్ర దృక్పథం లేనట్టు జగన్ మాట్లాడారని ఆరోపించారు.

లాక్ డౌన్ కొన్ని జోన్లకే పరిమితం చేయాలని ప్రధానితో అనడం బాధ్యతా రాహిత్యమేనని విమర్శించారు. సీఎంకు తోడు మంత్రులు సైతం అదేవిధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మాస్కులు కావాలని ప్రజలు అడుగుతుంటే మీకవసరం లేదని మంత్రులు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం లాక్ డౌన్ కొనసాగిస్తే సామాన్యుడి మనుగడకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.