లాక్‌డౌన్ వేళ ప్రభుత్వంపై విమర్శలు తగదు: పవన్ కళ్యాణ్
కరోనాను అరికట్టడానికి లాక్‌డౌన్‌తోపాటు సామాజిక దూరం పాటించాలని ప్రజలకు పవన్ సూచించారు. విపత్తు సమయంలో పేదలకు జనసేన అండగా ఉంటుందని, లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉందని పవన్ పేర్కొన్నారు.
ఈ సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని, లాక్‌డౌన్ తర్వాతే రాజకీయాలు, పాలనలోని వైఫల్యాలపై మాట్లాడదామని పవన్ అన్నారు.
ప్రభుత్వ సాయాన్ని వైసీపీ అభ్యర్థులు పంచడంపై ఈసీకి ఫిర్యాదు చేయాలని పవన్ స్పష్టం చేశారు. జనసేన ముఖ్య నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.