గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

అతివేగం.. వినాయకుడి ఆలయాన్ని ఢీకొట్టిన లారీ.. నుజ్జు నుజ్జు

Vinayaka
అతివేగం అనర్ధానికి దారితీస్తుందనే చెప్పాలి. ఏపీలోని కాకినాడలో స్థానిక వినాయకుడి ఆలయాన్ని వేగంగా లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆ ఆలయం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అలాగే ఆలయంలో నిద్రపోతున్న గ్రామస్థుడు లక్ష్మణరావు కూడా చనిపోయారని తెలిసింది. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
 
డ్రైవర్ నిద్రమత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.